allu arjun new movie

‘దువ్వాడ జగన్నాథమ్‌’గా వినోదం పంచడానికి సిద్ధమయ్యాడు అల్లు అర్జున్‌. ఈ చిత్రం ఈనెల 23న విడుదల కాబోతోంది. ఈలోగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టేశాడు బన్నీ. అదే… ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకుడు. అర్జున్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రధారులు. శిరీష, శ్రీధర్‌ లగడపాటి నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కి అల్లు అరవింద్‌ సతీమణి నిర్మల క్లాప్‌నిచ్చారు. అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘స్టైల్‌ సమయంలోనే మా సంస్థలో ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్‌ మాటిచ్చారు. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టు మాకు అప్పగించడం ఆనందంగా ఉంది. రచయితగా సూపర్‌ హిట్‌ కథలు అందించిన వక్కంతం వంశీ మెగాఫోన్‌ పట్టిన తొలి చిత్రం ఇది. అన్ని వర్గాల్నీ ఆకట్టుకొనే కథ, కథనాలతో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. జులై నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలెడతామ’’న్నారు. విశాల్‌ శేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: రాజీవ్‌ రవి, సహ నిర్మాత: బన్నీ వాసు, సమర్పణ: నాగబాబు.

Leave a Reply

Your email address will not be published.