pawan-trivikram

పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ వివరాలు ప్రకటించకుండానే ఈ చిత్రం రికార్డుల బాటపట్టింది. ప్రీ రిలీజ్‌లో ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా బిజినెస్‌ చేసే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

విడుదలకు ముందు ఇన్ని కోట్ల బిజినెస్‌ చేసిన తొలి తెలుగు చిత్రం బాహుబలి. ఆ తర్వాత రికార్డు పవన్‌ కల్యాణ్‌దేనని టాలీవుడ్‌లో వూహాగానాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. టైటిల్‌, ఇతర నటీనటుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.

Leave a Reply

Your email address will not be published.