air-india

ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ఎయిరిండియాకు మరో షాక్‌ తగిలింది. ముంబయిలోని సంస్థ హెడ్‌క్వార్టర్స్‌లో రూ.200 కోట్ల విలువైన చిత్రపటాలు మిస్సయ్యాయి. వాటిలో ప్రముఖ ఆర్టిస్ట్‌లు ఎం.ఎఫ్‌ హుస్సేన్‌, జతిన్‌ దాస్‌ల చిత్రపటాలు కూడా ఉన్నాయి. జతిన్‌ దాస్‌ తన పెయింటింగ్‌ కోసం ఎయిరిండియాను సంప్రదించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

చిత్రపటాల విషయమై ఎయిర్‌ఇండియా సీఎండీ అశ్విని లొహానిని మీడియా సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఈ విషయమై దర్యాప్తు చేయించాల్సిందిగా ఎయిర్‌ఇండియా పోలీసులను సంప్రదించింది.2011లో ఈ చిత్రపటాలను ఓ మ్యూజియంలో ఉంచేందుకు ఎయిరిండియా సన్నాహాలు చేసింది. అదే ఏడాదిలో హెడ్‌ క్వార్టర్స్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పబ్లిక్‌ మ్యూజియం నిర్మించాలనుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.