Baahubali 2 – The Conclusion Trail

రాజమౌళి రూపొందిస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం థియేటరికల్ హక్కులు, శాటిలైట్ ప్రసార హక్కులు, ఆయా భాషల అనువాద హక్కులు రికార్డు రేట్లకు అమ్ముడుపోతూ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యచకితులను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు సాయంకాలం ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ వేడుక ప్రసారం హక్కుల కోసం కూడా మంచి పోటీ ఏర్పడింది. దీంతో టీవీ 9, ఎన్టీవీ కలసి 75 లక్షలకు ఈ వేడుక టీవీ ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. బాహుబలి సీరీస్ పట్ల వున్న క్రేజ్ కారణంగా తమ టీఆర్పీ రేటింగ్ బాగా పెరుగుతుందని, వాణిజ్య ప్రకటనల ద్వారా లాభాలను ఆర్జించవచ్చని భావించిన సదరు టీవీ ఛానెల్స్ అంత రేటును పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సాయంకాలం ఆరున్నర నుంచి జరిగే ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని 360 డిగ్రీల యాంగిల్ లో ప్రసారం చేసి, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తారట.

Leave a Reply

Your email address will not be published.