బెనిఫిట్ షోలూ, బ్లాక్ టికెట్లూ అంటూ వాళ్ళూ వీళ్ళూ దోచుకోవటం ఏమిటీ అనుకున్నారేమో బాహుబలి 2 నిర్మాతలు తామే డైరెక్ట్ గా రంగం లోకి దిగారు.

పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుందంటే చాలు బెనిఫిట్ షోల పేరుతో అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకోవడానికి రంగం సిద్దం అవుతుంది. అది మెగాస్టార్ అయినా, సూపర్ స్టార్ అయినా, పవర్ స్టార్ అయినా, మరే స్టార్ అయినా….. సీన్ మాత్రం ఒక్కటే, అభిమానులను దోపిడీచేయడం.

prabash..అభిమానులు నిలుపు దోపిడీ ‘బాహుబలి’ సినిమా విడుదల సమయంలో అభిమానులు నిలుపు దోపిడీకి గురైన సంగతి తెలిసిందే. సినిమా చూడాలనే అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకున్నారు చాలా మంది థియేటర్ల వారు. టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్‌లో వేల రూపాయలకు అమ్మారు. ఇక హైదరాబాద్ లో బెనిఫిట్ షోల పేరుతో వేల రూపాయలు దండుకున్నారు కొందరు. చారిటీ పేరు చెప్పి ఆ డబ్బంతా అక్రమంగా తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అప్పట్లో ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది.

సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అంతే కాదు మొన్నటికి మొన్న కాటమరాయుడు సినిమా టికెట్ల ధర పెంపుపై అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కేవలం వంద కోట్ల క్లబ్ లో చేరాలన్న ఆశతోనే సినిమాను సామాన్యులకు దూరం చేస్తున్నారని ఆరోపించింది.

కాటమరాయుడు కాటమరాయుడు నిర్మాతలు ఈ చిత్రం టికెట్లను అమాంతం పెంచేయడానికి సిద్ధం అయ్యారు .ఈ నేపథ్యంలో అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం స్పందించింది. ‘కాటమరాయుడు’ టికెట్ల ధరల్ని పెంచి అమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

హైదరాబాద్ వరకే దాంతో ఈ దందా ని అరికట్టటానికి అసలు బెనిఫిట్ షో అనేవే లేకుండా చేసారు పోలీసులు. అయితే ఇది హైదరాబాద్ వరకే పరిమితం అయ్యింది. అయినా మిగతా చోట్ల ఈ దోపిడీ దందా ఆగలేదు ‘కాటమరాయుడు’ సినిమా విషయంలో చాలా చోట్ల ఇలాంటి దోపిడీ పర్వం కొనసాగింది.

ఒక్కొక్క టికెట్ రూ. 500 నుండి రూ. 3000 వరకు బెనిఫిట్ షోల పేరుతో ప్రత్యేక షోలు వేసి… పవన్ అభిమానుల నుండి సాధారణ టికెట్ రేట్ల కంటే 10 నుండి 20 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఒక్కొక్క టికెట్ రూ. 500 నుండి రూ. 3000 వరకు అమ్మినట్లు ప్రచారం జరిగింది. నిజానికి అది ప్రచారం కాదు అక్కద జరిగిందదే.

prabash

ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు అయితే వాళ్ళూ వీళ్ళూ దోచుకోవటం ఏమిటీ అనుకున్నారేమో బాహుబలి 2 నిర్మాతలు తామే డైరెక్ట్ గా రంగం లోకి దిగారు. బాహుబలి-2 టికెట్ కోసం నిర్ణీత ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారికంగానే బాహుబలి-2 టికెట్ల రేట్లను పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారట.

భారీ ఖర్చుతో తెరకెక్కించామని ఎన్నో కష్టాలకు ఓర్చి.. భారీ ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కించామని.. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తేవడంతో పాటు తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచిన సినిమా కాబట్టి ఇలాంటి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని.. దీనిపై ప్రేక్షకుల్లోనూ అంత వ్యతిరేకత ఉండదని ప్రభుత్వానికి విన్నవించుకుని టికెట్ల రేట్ల పెంపు నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు.

రోజుకు ఐదు షోలు మరోవైపు తొలి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా అనుమతి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారట. ఈ రెండు ప్రతిపాదనలూ ఓకే అయితే.. బాహుబలి టీం పంట పండినట్లే. బాహుబలి వసూళ్ళని ఎవ్వరూ టచ్ చేయలేనంత భారీ వసూళ్ళు సాధిస్తుంది… అయితే సామాన్య ప్రేక్షకుడు మాత్రం నా నా ఇబ్బందులూ పడాల్సిందే…

Leave a Reply

Your email address will not be published.