Home/Movie News/బూచాడే భామతో బాలకృష్ణ
nandamuri-balakrishna

బూచాడే భామతో బాలకృష్ణ

బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రియ, ముస్కాన్‌ కథానాయికలు. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ఓ ప్రత్యేకగీతం ఉండబోతోంది. పూరి సినిమాల్లో ప్రత్యేకగీతం అంటే దానికి మరింత ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు బాలయ్య సినిమాలోని పాట కోసం కసరత్తులు జరుగుతున్నాయి. బూచాడే బూచాడే… అంటూ అల్లు అర్జున్‌ ‘రేసుగుర్రం’లో సందడి చేసిన కైరా దత్‌ ఆ పాటలో ఆడిపాడబోతోంది. మొదట ఆ పాటని సన్నీలియోన్‌తో చేయించాలనుకొన్నారు. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో కైరాని ఎంపిక చేసుకొన్నారు. పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లోనూ కియారా సందడి చేయబోతుంది. పోర్చుగల్‌ నుంచి రాగానే హైదరాబాద్‌లో తీర్చిదిద్దుతున్న ప్రత్యేకమైన సెట్‌లో ఆ పాటని తెరకెక్కించనున్నట్టు సమాచారం. మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నారు.

Kyra Dutt

Leave a Reply

Your email address will not be published.