Weight-Loss-pic

సన్నగా.. ఇలియానా లాంటి నడుము ఉండాలని కాలేజీకెళ్లే ప్రతీ అమ్మాయీ కోరుకుంటుంది కదూ.. కానీ దానికేం చేస్తున్నారనేదే ప్రధానం. భోజనం మానేయడం.. అతిగా వ్యాయామలు చేయడమే మాత్రమే పరిష్కారం కాదు.. ఇంకా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి.

* పొద్దుటిపూట ఎన్ని పనులున్నా సరే.. అల్పాహారం తినడం అలవాటుగా మార్చుకోండి. అందులోనూ మాంసకృత్తులున్న ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. అలా మధ్యాహ్నం భోజనాన్ని మితంగా తీసుకోగలుగుతారు.
* భోజనానికి ముందు.. ఒక కీరా, క్యారెట్‌ తిన్నా చాలు.. మిగిలిన పదార్థాలను మితంగా తీసుకోవచ్చు. అలా తక్కువ అన్నంతో పొట్ట నింపేసుకోవచ్చు.
* చాలాసార్లు దాహంగా అనిపించినప్పుడు ఆకలి అనుకుని ఏదో ఒకటి తినేయడానికి చూస్తాం. ఈ సారి ఆ పని చేయకండి. ముందు గ్లాసు మంచినీళ్లు తాగి చూడండి. ఆకలి తగ్గితే సరి. లేదంటే.. అప్పుడు ఓ పండో, పండ్లరసమో, గ్రీన్‌టీనో తీసుకోండి.
* ఓ నెలరోజులు.. మీరేం తింటున్నారనేది ఓ పుస్తకంలో రాయండి. నెల తరవాత దాన్ని గమనించండి. కెలొరీలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఆ జాబితాలో కొట్టేయండి. మరో నెల వాటిని పూర్తిగా మానేసేలా చూసుకోండి.

 

Leave a Reply

Your email address will not be published.