ఫేస్‌బుక్ @ 200 కోట్లు..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తాజాగా 200 కోట్ల యూజర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రపంచాన్ని అనుసంధానం చేయడంలో తాము ఎల్లప్పుడూ ప్రగతి సాధిస్తున్నామని, దీంతో యూజర్లు ఒకరికొకరు మరింత దగ్గరవుతున్నారని, వారితో తమ ప్రయాణం కొనసాగుతుందని జుకర్ బర్గ్ తన పోస్టులో రాశారు. కాగా 200 కోట్ల యూజర్ల మార్క్‌కు చేరుకున్న సందర్భంగా ఫేస్‌బుక్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. దాన్ని యూజర్లు తమ ఫేస్‌బుక్ ఖాతాలో https://www.facebook.com/goodaddsup లింక్‌ను సందర్శించడం ద్వారా వీక్షించవచ్చు.

Leave a Reply

Your email address will not be published.