బాలయ్యకు ఫ్యాన్స్‌ ఝలక్‌

►అభిమాన నటుడి పర్యటనకు దూరం
►టీడీపీ నేతల కనుసన్నల్లోనే కోటంరెడ్డి సభ
►ఎమ్మెల్యేలు పోలంరెడ్డి, బొల్లినేనితో పాటు పార్టీ నేతలు ఆనం బ్రదర్స్‌ దూరం  

నెల్లూరు : హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు ఆయన ముఖ్య అభిమాన సంఘనేతలు ఝులక్‌ ఇచ్చారు. దశాబ్దాల పాటుగా బాలకృష్ణ అభిమాన నేతలుగా కొనసాగుతన్న వారు, ముఖ్య అభిమాన గణం సుమారు 70 శాతం మంది బాలయ్య పర్యటనకు పూర్తిగా దూరంగా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నుడా (నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ )చైర్మన్‌గా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. సీనినటుడు బాలకృష్ణ సిఫార్సుతో ఆయన్ను పదవి వరించింది. దీంతో కోటంరెడ్డి బాలకృష్ణ సమక్షంలో చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించి శనివారం సాయంత్రం నగరంలోని నర్తకీ సెంటర్‌లో బహింగసభ నిర్వహించారు. దీనికి  ముఖ్యఅతిథిగా బాలకృష్ణ హజరయ్యారు. ఈక్రమంలో నెల్లూరులో ఎక్కడ చూసినా బాలకృష్ణకు స్వాగత ఫ్లెక్సీలతో నగరాన్ని హోరెత్తించారు.

అన్ని ప్రధాన ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోనూ అభిమాన సంఘ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి అట్టహసంగా సభ నిర్వహించారు. అయితే గత నాలుగు దశాబ్దాలుగా దివంగత ఎన్టీఆర్‌ కుటంబంతో, బాలకృష్ణతో అనుబంధ ఉండి ఫ్యాన్స్‌ అసోసియేషన్లు నిర్వహించే నేతలు రాకపోవటం సభలో చర్చనీయాంశంగా మారింది. అఖిలభారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి  తాళ్లపాక రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనురా«ధ, వారి వర్గం పూర్తిగా దూరంగా ఉన్నారు. అలాగే బాలకృష్ణ అభిమాన సంఘ అధ్యక్షుడు కిన్నెర బ్రదర్స్‌ కూడా సభకు గైర్హాజరయ్యారు. దీంతో బాలయ్య అభిమానుల మధ్య ఏదో జరుగుతుందనే  చర్చ మొదలైంది. అయితే బాలయ్య ఉక్కిరిబిక్కిరయ్యేలా సన్మానించిన వారిలో ఎక్కువ మంది చిరంజీవి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలుండటం విశేషం. దీనిపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా దీనిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు డుమ్మా…
ఇదిలా ఉండగా సభకు టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు ఆనం బ్రదర్స్, నగర టీడీపీ కార్పొరేటర్లు సభకు దూరంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.