Home/News/భారత్ అ’ద్వి’తీయ విజయం
భారత్‌ 251/4 ∙వెస్టిండీస్‌తో మూడో వన్డే

భారత్ అ’ద్వి’తీయ విజయం

వెస్టిండీస్ 158 ఆలౌట్ 
ఆంటిగ్వా: నార్త్సౌండ్ వేదికగా వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్తో జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ మరోసారి చిత్తుచిత్తుగా ఓడింది. ఛేదనలో ఆజట్టు బ్యాట్స్మెన్ ఏమాత్రం పోరాట పటిమ కనబర్చకపోవడంతో 38.1 ఓవర్లలో కేవలం 158 పరుగులకే ఆలౌటైంది. స్పిన్ ద్వయం అశ్విన్(3/28), కుల్దీప్ యాదవ్(3/41) కరీబియన్ను తిప్పేశారు. జేసన్ మహ్మద్(40: 61 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్. దీంతో భారత్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యం సాధించింది. అంతకుముందు భారత్ ఇన్నింగ్స్ లో మహేంద్రసింగ్(78), రహానె(72) మెరవడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 251 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును ధోనీ అందుకున్నాడు.

స్పిన్ ‘ద్వయం’ అదరహో 
252 పరుగుల ఛేదనకు దిగిన విండీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ఉమేశ్యాదవ్ వేసిన రెండో ఓవర్లోనే ఎవిన్ లూయిస్(2) బౌల్డయ్యాడు. ఈ దశలో క్రీజులో ఉన్న కైల్ హోప్(19: 35 బంతుల్లో 3×4), షెయ్ హోప్(24: 50 బంతుల్లో 2×4) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఏడో ఓవర్లో హోప్ సోదరులు చెరో బౌండరీ బాదడంతో 10 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు విండీస్ స్కోరు 40/1. క్రీజులో కుదురుకున్న వీరిద్దరినీ విడదీసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లి యువ బౌలర్లు హార్డిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ను బరిలోకి దించాడు. 13వ ఓవర్లో కైల్ను హర్డిక్ పాండ్య ఔట్ చేయగా.. 14వ ఓవర్లో అప్పుడే క్రీజులోకి వచ్చిన రోస్టన్ ఛేజ్(2)ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. ఐతే ప్రమాదకరంగా మారుతున్న షెయ్ హోప్ను 17వ ఓవర్లో పాండ్య పెవిలియన్ పంపడంతో విండీస్ టాప్ఆర్డర్ కుప్పకూలింది. యాదవ్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన మహ్మద్ దూకుడుగా కనిపించాడు. ఈ దశలో కష్టాల్లో ఉన్న విండీస్ను ఆదుకునేందుకు నిశ్చయించుకున్న సారథి హోల్డర్ ఎక్కువసేపు నిలవలేదు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ వేసిన అద్బుత బంతిని అంచనా వేయడంలో విఫలమైన హోల్డర్.. ధోనీ చేతిలో స్టంపౌటయ్యాడు. అతని ఔట్తో విండీస్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఓవైపు భారత బౌలర్ల పటిష్ఠ బౌలింగ్ దెబ్బకు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ మరో ఎండ్లో ఉన్న మహ్మద్ ఒంటరిగా పోరాడాడు. 87/5తో ఇబ్బందుల్లో ఉన్న జట్టును పావెల్ సహకారంతో మెరుగైన స్థితిలో నిలిపాడు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యం దిశగా సాగుతుండటం.. ఓ దశలో 126 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉండటంతో కరీబియన్ శిబిరంలో ఆశలు చిగురించాయి. ఐతే 141 పరుగుల వద్ద పాండ్య బౌలింగ్లో పావెల్(30: 43 బంతుల్లో 5×4) ఆరో వికెట్గా వెనుదిరగడంతో మహ్మద్కు సహకరించే వారు కరవయ్యారు. చివరికి యువ సంచలనం, చైనామన్ కుల్దీప్ కళ్లుచెదిరే బంతికి అతడు ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అనంతరం మిగతా వికెట్లు స్వల్ప వ్యవధిలోనే కోల్పోవడంతో విండీస్ 158 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో ఐదు ఓవర్లు వేసిన భువీ వికెట్ కూడా తీయకపోగా.. హార్డిక్ పాండ్య రెండు, జాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు. బౌలింగ్కు సహకరించిన పిచ్ను టీమ్ఇండియా బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.