wonder

ప్రాణాన్ని లెక్కచేయకుండా సాహసక్రీడల్లో పాల్గొనేందుకు కొందరు అమితాసక్తి కనబరుస్తుంటారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ప్రాణాన్ని లెక్కచేయరు. సాహసాలు చేయడమే వాళ్లు పనిగా పెట్టుకుంటారు. అలాంటి ఒక వ్యక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కేవలం 350డాలర్ల ప్రైజ్‌ మనీ గెలుచుకునేందుకు ఏకంగా ఒంటిమీది దుస్తులకు నిప్పంటించుకుని మరీ సాహసం చేశాడు ఓ యువకుడు. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డాడు. అత్యంత ప్రమాదకరమైన ఈ వింత పోటీ రష్యాలోని కెమెరోవో ప్రాంతంలో జరిగింది.

రష్యాలోని కెమెరోవో ప్రాంతంలో ఉన్న ఓ రిసార్టులో ఏటా ‘పూల్‌ అండ్‌ రైడ్‌’ పేరుతో పోటీలు నిర్వహిస్తుంటారు. గడ్డ కట్టి ఉన్న మంచుకొండ పైనుంచి స్కేటింగ్‌ చేస్తూ అక్కడి స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాలి. అలా దూకడంలో ఎవరు ట్రెండీగా ప్రయత్నిస్తారో అతనే విజేత. అందుకే అందరికంటే భిన్నంగా ట్రై చేయాలనుకున్నాడు 26 ఏళ్ల ఆంటన్‌ రెడ్వోక్‌. తాను వేసుకున్న సూటుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించుకున్నాడు. ఒక్కసారే మంట ఎగిసిపడింది. పొగలు కక్కుతుండగా.. పరుపరుగున వచ్చి నీటిలో దూకాడు. అప్పటికే అయ్యగారి సూటు కాలిపోయింది.. ఒంటికి మంట అంటుకుంది. బాగానే గాయాలయ్యాయి. దాంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్ది బతికి బయటపడ్డాడు.
అందరికంటే ధైర్యంగా ప్రయత్నించిన ఆంటన్‌ను విజేతగా ప్రకటించారు నిర్వాహకులు. అంతేకాదు.. అతనికి ‘బర్నింగ్‌ ఏంజిల్‌’ అని బిరుడు కూడా ఇచ్చేశారు.

Leave a Reply

Your email address will not be published.