వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌!

వాస్తవ సంఘట నలను, జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సిద్ధహస్తుడు! ఫర్‌ ఎగ్జాంపుల్‌… తెలుగులో ఆయన తీసిన ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’… కన్నడలో ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’… హిందీలో ‘సర్కార్‌’ సిరీస్, ‘ద ఎటాక్స్‌ ఆఫ్‌ 26/11’ సినిమాలు. ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తీయబోతు న్నట్టు వర్మ ప్రకటించారు. అంటే… ఎన్టీఆర్‌ గురించి వర్మ స్వయంగా చెప్పిన మాటలు, ‘జై ఎన్టీఆర్‌…’ అంటూ పాడిన పాటతో కూడిన ఆడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అందులో ‘నేను ఎన్టీఆర్‌ ఫ్యాన్‌’ అని వర్మ పేర్కొన్నారు. అయితే… హీరోగా ఎవరనేది వర్మ చెప్పలేదు. ఎన్టీఆర్‌ తనయుడు, నటుడు బాలకృష్ణ తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో సినిమా తీస్తామనీ, అందులో తానే హీరోగా నటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్వశ్చన్‌ ఏంటంటే… బాలకృష్ణ హీరోగా నటించబోయే ఎన్టీఆర్‌ బయోపిక్‌కి వర్మ దర్శకత్వం వహిస్తారా? లేదా మరో హీరోతో తీస్తారా? వెయిట్‌ అండ్‌ సీ!!

Leave a Reply

Your email address will not be published.