అన్నదమ్ములు చిరంజీవి, పవన్‌కల్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సిన్మా నిర్మించనున్నట్టు మొన్నామధ్య కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్లీ మరో కబురు చెప్పారు టీయస్సార్. కథ సిద్ధమవుతోందట!
ప్రస్తుతం పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న సిన్మా సెట్స్‌కు టీయస్సార్ వెళ్లారు. మాటల మధ్యలో ‘‘టీయస్సార్ (అన్నయ్య చిరూతో చేయబోయే!) సినిమా సంగతేంటి? కథ ఎంతవరకు వచ్చింది’’ అని చిరు తమ్ముడు పవన్ అడిగితే… ‘‘ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాను’’ అని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారట! ‘‘ప్రస్తుతం హీరోలు, దర్శకుడు ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. వాళ్ల కమిట్మెంట్స్ పూర్తవగానే అశ్వనీదత్‌తో కలసి ఈ మెగా మూవీని నిర్మిస్తా’’ అన్నారు టీయస్సార్.