Home/Movie News/మహేష్‌తో పూజా హెగ్డే?
Pooja Hegde with Mahesh

మహేష్‌తో పూజా హెగ్డే?

ముకుంద’ సినిమాతో తెరంగేట్రం చేసింది పూజా హెగ్డే. ఆ తరవాత బాలీవుడ్‌ వైపు దృష్టి సారించింది. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రాల్లో మళ్లీ అవకాశాల్ని అందుకొంటోంది. ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్‌’లో అల్లు అర్జున్‌తో జోడీ కట్టింది పూజా. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా తన ఖాతాలో మరో సినిమా చేరిపోయింది. త్వరలోనే మహేష్‌బాబుతో కలసి పూజా నటించనున్నదని సమాచారం. ప్రస్తుతం ‘స్పైడర్‌’తో బిజీగా ఉన్నాడు మహేష్‌. మరోవైపు కొరటాల శివ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కూడా జరుగుతోంది. మహేష్‌ కోసం వంశీ పైడిపల్లి ఓ కథ సిద్ధం చేశారు. 2018 ప్రథమార్ధంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో కథానాయికగా పూజా పేరు ఖరారు చేశారని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

Leave a Reply

Your email address will not be published.