Home/News/రూ.2500 కోట్ల రెవెన్యూ లాస్
రూ.2500 కోట్ల రెవెన్యూ లాస్

రూ.2500 కోట్ల రెవెన్యూ లాస్

జీఎస్టీ వల్ల రాష్ట్రం సుమారు 2,500 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవలసివస్తుందని తెలంగాణా ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 35 వస్తువులపై పన్ను తగ్గించాలని కోరినా కేంద్రం స్పందించలేదన్నారు. తెలంగాణా నుంచి కేంద్రానికి రూ. 8,500 కోట్లు పన్ను రూపేణా వెళ్తే.. కేంద్రం వాటా నుంచి రాష్ట్రానికి కేవలం 6 వేల కోట్లు మాత్రమే తిరిగి వస్తుందని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఎలా భర్తీ చేస్తుందో చూడాలని ఈటల అన్నారు.

శుక్రవారం ఢిల్లీ లో జీఎస్టీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి అతిథిగా హాజరైన ఆయన..ఈ కొత్త పన్నుల వ్యవస్థ అమలుకు అవసరమైన సాఫ్ట్ వేర్, అధికారులకు శిక్షణ, వ్యాపార వర్గాలకు అవగాహన రావాలంటే 4 నెలలు వేచి చూస్తే బాగుంటుందని సూచించినట్టు తెలిపారు. మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలపైనా 18 శాతం పన్ను విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.