samantha

‘ఇమేజ్‌’ చట్రానికి ఎవ్వరూ అతీతులు కాదు. ‘మేం ఎలాంటి ఇమేజ్‌నీ కోరుకోవడం లేదు’ అని తారలు చెప్పినా… వాళ్లకంటూ ఓ ముద్ర పడిపోతుంటుంది. మరీ ముఖ్యంగా కథానాయకులకు. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ పాత్రల్లో కథానాయకుల్ని చూపించడం వల్ల అభిమానులు వాళ్లని అలానే ­హించుకొంటుంటారు. ‘హీరోల వరకూ అది బాగానే ఉంటుంది. కానీ మమ్మల్ని మాత్రం అలా ­హించుకోవద్దు’ అంటోంది సమంత. ‘‘తెరపై కథానాయకుల్ని అసామాన్యులుగా చూపిస్తారు. అలా చూపిస్తేనే అభిమానులకూ ఇష్టం. అయితే… కథానాయికల పాత్రల్ని ఆ స్థాయిలో తీర్చిదిద్దలేరు. మేం ఎప్పుడూ పక్కింటి అమ్మాయిల్లానే కనిపించాలి. అలా కనిపించడమే నాకు ఇష్టం. అప్పుడే… సామాన్య ప్రేక్షకులు మమ్మల్ని, మా పాత్రల్నీ స్వాగతిస్తారు. నా చుట్టూ జనం గుమిగూడినప్పుడు ‘నిన్ను చూస్తే మా అమ్మాయి గురొస్తుంది’ అని చాలా మంది తల్లులు చెప్తుంటారు. ఆ సమయంలో చాలా సంతోషం వేస్తుంది. ఈ తరహా స్పందనే కథానాయికలు కోరుకొంటుంటార’’ని చెప్పింది సమంత.

Leave a Reply

Your email address will not be published.