Home/News/హైదరాబాద్‌లో స్టార్‌ హైపర్‌
Star Hyper in Hyderabad

హైదరాబాద్‌లో స్టార్‌ హైపర్‌

ఈనాడు, హైదరాబాద్‌: టాటా, టెస్కోల ఉమ్మడి సంస్థ ట్రెంట్‌ హైపర్‌ మార్కెట్‌ రానున్న రెండుమూడేళ్లలో 200 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో హైదరాబాద్‌లో 50 వరకూ ఉంటాయి. ఈ సంస్థ హైదరాబాద్‌ గచ్చిబౌలిలో తన తొలి స్టార్‌ హైపర్‌ మార్కెట్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ అత్యాధునిక విక్రయ కేంద్రాన్ని దాదాపు 22,000 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేశారు. కూరగాయలు, పళ్లు, ఇతర నిత్యావసర సరకులు, దుస్తులు, మాంసాహార ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తులతో సహా మొత్తం 15,000 రకాల వరకూ వస్తువులు ఇక్కడ లభించనున్నాయి. ఇందులో 30శాతం వరకూ టాటా ఉత్పత్తులు ఉంటాయని ట్రెంట్‌ హైపర్‌ మార్కెట్‌ ఎండీ జంషెడ్‌ దాబూ తెలిపారు. హైదరాబాద్‌తో కలిపి తమకు 45 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. రానున్న రెండు మూడేళ్లలో 200 విక్రయ కేంద్రాలకు పైగా ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని వివరించారు. పటాన్‌చెరు సమీపంలో పంపిణీ కేంద్రాన్ని రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.