chandrashekar rao telangana cm

తెలంగాణలో రిజర్వేషన్ల కోటా 69 శాతానికి పెరగనుంది. ముస్లిం రిజర్వేషన్లను నాలుగు నుండి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 నుండి 9 శాతానికి పెంచనుంది ప్రభుత్వం.

హైదరాబాద్: తెలంగాణలో రిజర్వేషన్ల కోటా 69 శాతానికి పెరగనుంది. ముస్లిం రిజర్వేషన్లను నాలుగు నుండి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 నుండి 9 శాతానికి పెంచనుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రత్యేక మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ఈ ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చుకొనే ప్రక్రియలో భాగంగా టిఆర్ఎస్ రంగం సిద్దం చేసింది. ముస్లింలకు రిజర్వేషన్లను నాలుగు నుండి 12 శాతానికి పెంచనున్నట్టు ప్రకటించింది. అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 4 నుండి 12 శాతానికి పెంచితే ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిది.

రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించిన ముసాయిదా బిల్లులను తయారుచేఇారు. బుదవారం నాడు ప్రత్యేకంగా నిర్వహించే మంత్రివర్గం సమావేశంలో ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
తమిళనాడు తరహాలోనే తెలంగాణలో రిజర్వేషన్లు

తమిళనాడు తరహాలోనే తెలంగాణలో రిజర్వేషన్లు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టుగానే తెలంగాణలో కూడ రిజర్వేషన్లు 69 శాతానికి పెరగనున్నాయి. ఎస్ టీ రిజర్వేషన్లను 6 నుండి 9 శాతానికి, ముస్లిం రిజర్వేషన్లను 4 నుండి 12 శాతానికి, బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుండి 33 శాతానికి పెంచనున్నారని సమాచారం. నిజానికి ప్రస్తుతం ముస్లింలు బీసీ -ఈ జాబితాలో ఉన్నారు.బీసీలకు 29శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.అయితే ముస్లింలకు ఇచ్చే 4 శాతం ఇందులోనే ఉంది.ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచనున్నారు.అయితే బీసి రిజర్వేషన్ల నుండి ముస్లిం రిజర్వేషన్లను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ప్రత్యేక కోటా చేయాలనే ప్రభుత్వం భావిస్తోంది.

 

Telangana is 69% reservation, 12% reservations for Muslims, the BJP opposed

 

Leave a Reply

Your email address will not be published.