Home/Movie News/14న తెరపైకి వార్‌ ఫర్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌
14న తెరపైకి వార్‌ ఫర్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌

14న తెరపైకి వార్‌ ఫర్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌

తమిళసినిమా: సాధారణంగా హాలీవుడ్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. అందులోనూ సైన్స్‌ఫిక్షన్‌ కథా చిత్రాలపై మరింత ఆసక్తి ఉంటుంది. ఇక జంతువుల ఇతివృత్తంతో రూపొందిన చిత్రాలు అపజయం పాలవడం ఉండదనే చెప్పవచ్చు. అలా చింపాజీ కథాంశాలతో వచ్చిన పలు చిత్రాలు వసూళ్ల వర్షం కురింపించాయి. అలా భారత దేశంలో విజయవిహారం చేసిన హాలీవుడ్‌ చిత్రాల్లో ప్లానెట్‌ ఆఫ్‌ ఏప్స్‌ చిత్రాలు చోటుచేసుకున్నాయి.

కాన్‌క్వెస్ట్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ఏప్స్‌ పేరుతో 1972లోనే వచ్చిన చిత్రం అప్పట్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఆ తరువాత దానికి సిరీస్‌గా 2011లో వచ్చిన ది రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ఏప్స్‌ చిత్రం వివేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత 2014లో డాన్‌ ఆఫ్‌ ది ప్టానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ చిత్రం వచ్చినా అది వరిజినల్‌ చిత్రానికి సీక్వెల్‌ కాదన్నారు దర్శకుడు రూపర్ట్‌ యట్‌. కాగా ఆ సిరీస్‌లో వస్తున్న మూడవ చిత్రం వార్‌ ఫర్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ అన్నారు. ఇది ఊహించని మలుపులతో ఉత్కంఠ భరిత పోరు సన్నివేశాలతో ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుందంటున్నారు. ఈ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేస్తున్న ఫాక్స్‌ స్టార్‌ స్డూడియోస్‌ నిర్వాహకులు. ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 14న భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *