samantha

సుకుమార్‌ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తోంది. రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్న ఆ చిత్రంలో నాయకానాయికల పాత్రల తీరుతెన్నులు ఇదివరకు తెలుగు తెరపై చూడని విధంగా ఉండబోతున్నాయట. రామ్‌చరణ్‌ చెవులు వినిపించని ఓ యువకుడిగా తెరపై కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కథానాయిక సమంత పాత్రకి సంబంధించి కూడా అలాంటి మరో విషయమే వినిపిస్తోంది. సినిమాలో సమంత మాట్లాడలేని ఓ అమ్మాయిగా కనిపించబోతోందని సమాచారం. అదేగనక నిజమైతే సుకుమార్‌ నిజంగా ఓ గొప్ప ప్రయోగం చేస్తున్నట్టే. అయితే చిత్రబృందం మాత్రం ఆ విషయాల్ని అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అన్నట్టు ఈ సినిమా కోసం బుల్లితెరపై సందడి చేస్తున్న వ్యాఖ్యాత అనసూయని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది.samantha

Leave a Reply

Your email address will not be published.